Andhrapradesh
టిడిపి శాంతి యుత ర్యాలీకి తరలి వెళ్లిన మంత్రాలయం టిడిపి నేతలు.
టిడిపి నేతలు మంత్రాలయం ఇంచార్జ్ పాలకుర్తి తిక్క రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరవరామకాంత్ రెడ్డి,
చంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము సైతం అంటూ శాంతియుత ర్యాలీ.
కర్నూల్ నగరంలో చేస్తున్న సాంఘిక భావ శాంతియుత ర్యాలీకి మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కా రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి , ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు మండలాల నుండి 40 వాహనాలలో బయలుదేరి వచ్చారని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్టీ బీసీ కళాశాల నుండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీని విజయవంతం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మేము సైతం అంటూ చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని సాక్షధారాలు లేని ఆరోపణలతో అరెస్టు చేసి పైసాచికానందాన్ని పొందుతున్నారని వీటన్నిటికీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు పై అక్రమంగా బనయించిన కేసును ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కర్నూల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార విభాగ ప్రతినిధి నరవ రామ కాంత్ రెడ్డి, భాష, నాలుగు మండల, నాయకులు ,కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు వందలాదిమంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.