Andhrapradesh
పేదల సంపూర్ణ ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష… ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ.
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల వద్దకే వైద్య సేవలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పేర్కొన్నారు. వెల్దుర్తి మండలం కలగొట్ల గ్రామంలో ఈరోజు సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించి మాట్లాడారు.ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రులను నాడు-నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారన్నారు. సీఎం జగనన్న చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. రోగులకు అందిస్తున్న సేవలను స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.