Andhrapradesh
సిఎం కాన్వాయ్ రిహార్సల్స్ పరిశీలించిన అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూల్ జిల్లా ఎస్పీ.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి.
సిఎం పర్యటన పై అన్ని సెక్టర్ ఇంచార్చ్ పోలీసు అధికారులకు భ్రీఫింగ్ చేసిన అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూల్ జిల్లా ఎస్పీ.
కర్నూల్ రేంజ్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్ అమ్మి రెడ్డి ఐపీఎస్ , కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
పకడ్బందీ భద్రతతో విధులు నిర్వహించాలి.
రేపు జరగబోయే జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాక సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టిందని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్ అమ్మి రెడ్డి ఐపీఎస్,జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ బుధవారం తెలిపారు.
ఈ సంధర్బంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మిగనూరు డిఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం బందోబస్తుకు విచ్చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.సెక్టర్ ఇంచార్జ్ అధికారులకు భ్రీఫింగ్ చేసి పలు సూచనలు, సలహాలు జాగ్రతల గురించి తెలియజేశారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి , పకడ్బందీ భద్రతో విధులు నిర్వహించాలన్నారు.
ఎవరికీ కేటాయించిన విధులలో పూర్తి బాధ్యతలతో విధులు నిర్వహించాలన్నారు.ఎటువంటి రిమార్కులు లేకుండా బాగా పని చేయాలన్నారు.
బహిరంగ సభ ప్రవేశ, నిష్క్రమణల దగ్గర యాక్సెస్ కంట్రోల్ వారు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.విధుల పట్ల అలసత్వం వహించరాదన్నారు. హెలిప్యాడ్, బహిరంగ సభ, బ్యారికెడింగ్, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ , ఇతర భద్రత ఏర్పాట్ల గురించి కర్నూల్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీ ఆర్.ఎన్ అమ్మి రెడ్డి ఐపీఎస్ జిల్లా జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆరా తీసి పరిశీలించారు.
బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు ,పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు, సెక్టర్ ఇంచార్జ్ అధికారులు ,రూట్ బందోబస్తు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ,కడప ,అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, చిత్తూరు జిల్లాలకు చెందిన అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు,సిఐలు ,ఎస్సైలు ఉన్నారు.