Andhrapradesh
బాబు అరెస్టుతో జగన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టాట్.
జగన్ రాక్షస క్రీడకు త్వరలోనే ముగింపు పలుకుతాం.
జగన్ రెడ్డి నియంతృత్వానికి శుభం కార్డు వేస్తాం.
సంఘీభావం తెలిపే వారి పై కేసులు పెట్టడం సిగ్గు చేటు.నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు.
రాష్ట్రంలో జగన్ ఆడుతున్న వికృత క్రీడకు త్వరలోనే ప్రజలంతా ఏకమై చెక్ పెట్టబోతున్నారని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.నరసరావుపేట 11వ వార్డులో ‘బాబుతో నేను’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డా౹౹చదలవాడ తప్పుడు కేసులు,తప్పుడు ఆరోపణలతో 40 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు.చంద్రబాబు బయటికొస్తే తమకు శంకరగిరి మాన్యాలు తప్పవని జగన్ రెడ్డి గుర్తించారు.అందుకే కేసును ఆలస్యం చేసి చంద్రబాబును జైల్లోనే ఉంచాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని అన్నారు.40 రోజులుగా ఒక్క ఆధారం కూడా కోర్టులకు చూపించలేదని జగన్ రెడ్డి వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని పోలీసులను పావులా వాడుకుంటున్నారన్నారు.డాక్టర్ల నివేదికను కుటుంబ సభ్యులకు,కోర్టులకు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబును అరెస్టు చేసి జగన్ రెడ్డి పొందుతున్న వికృతానందం ఎన్నో రోజులు ఉండదని గుర్తుంచుకో అని హెచ్చరించారు.భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు వస్తే కేసులు పెట్టడం దేనికి నిదర్శనం అన్నారు.రాజమండ్రిలో అడుగు పెట్టడానికి వీల్లేదని తెలుగుదేశం నేతలకు నోటీసులిస్తున్నారన్నారు.వ్యవస్థల్ని నాశనం చేస్తూ,ప్రజల హక్కుల్ని హరిస్తూ జగన్ రెడ్డి టెర్రరిస్టులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.చంద్రబాబును జైల్లో పెట్టిన నాడే వైసీపీ కౌండ్ డౌన్ స్టార్ట్ అయిందని చంద్రబాబుకు ఏదన్నా జరిగితే జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి వస్తుందని డా౹౹చదలవాడ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు,క్లస్టర్,యూనిట్ ఇంఛార్జీలు,పట్టణ,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.