రాష్ట్ర ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి కర్నూల్ రేంజ్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ.
జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా , ఎమ్మిగనూరు పట్టణంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా కు విచ్చేశారు.
ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ని ఓర్వకల్లు ఎయిర్పోర్టులో కర్నూల్ రేంజ్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్ అమ్మి రెడ్డి ఐపియస్,ఎమ్మిగనూరు పట్టణంలో కర్నూల్ జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.