Andhrapradesh
డోన్ పట్టణంలో ‘వాణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ను ప్రారంభించిన ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు బుగ్గన,గుమ్మనూరు జయరాం .
డోన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యసేవలు..
డోన్,నంద్యాల జిల్లా,అక్టోబర్, 20; డోన్ ప్రజలకు మరింత అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.డోన్ పట్టణంలో ‘వాణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ను కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. మూడంతస్తుల భవనంలో ఏర్పాటైన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సమగ్ర వైద్య సదుపాయాలు బాగున్నాయని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఇరువురు మంత్రులు ఒక్కో అంతస్తు ఎక్కి అక్కడ ఏర్పాటైన రేడియాలజీ, ఓపీ, రిసెప్షన్, ఫార్మసీ, రోగులు వేచియుండే గది సహా అన్నింటిని పరిశీలించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఇరువురు మంత్రుల రాకతో వాణి హాస్పిటల్ ప్రాంగణం కిక్కిరిసింది. హాస్పిటల్ లో విధులు నిర్వర్తించనున్న వైద్యులు, సిబ్బంది మంత్రులిద్దరితో ఫోటో దిగడానికి పోటీ పడ్డారు.ఈ కార్యక్రమానికి మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి,గుమ్మనూరు ఈశ్వర్, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు,ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, వైసిపి డోన్ మండల అధ్యక్షులు మల్లంపల్లి రామచంద్రుడు,హాస్పిటల్ నిర్వాహకులు డా”రామకృష్ణ నాయుడు, వేణుగోపాల్,నాగరాజు తదితరులు హాజరయ్యారు..