Andhrapradesh

దసరా స్ఫూర్తితో… సైకో పాలనను అంతమొందిద్దాం: టిడిపి.

Published

on

137 Views

సైకో పాలన పోవాలంటూ.. పత్రాలను దహనం చేసిన టిడిపి నేతలు.

ఎమ్మిగనూరు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ… దసరా స్ఫూర్తితో… అరాచక, విధ్వంసకర పాలన సాగిస్తున్న సైకో జగనాసూరుడి పాలన అంతమొందించడానికి విజయం సాధించేంతవరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా పోరాడాలని టిడిపి నేతలు పేర్కొన్నారు. టిడిపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం విజయదశమి సందర్భంగా.. సాయంత్రం 7:00 గంటలకు ఐదు నిమిషాల పాటు స్థానిక వైయస్సార్ సర్కిల్ నందు “సైకో పోవాలి” అని రాసి ఉన్న పత్రాలను మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ… దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసిందన్నారు. ఇదే స్ఫూర్తితో సైకో జగన్ పాలనను అంతమొందించడానికి మరో ఏడు నెలలు టిడిపి కార్యకర్తలు ఆలు పెరగని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశమంతా ప్రజలు రావణ దహనం చేస్తే..! మనమంతా వచ్చే ఎన్నికల్లో.. జగనా సూరుని దహనం చేసి చంద్రన్న నాయకత్వంలో.. సైకిల్ పాలన తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో… ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, ఆం.ప్ర సగర (ఉప్పర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, కర్నూల్ పార్లమెంట్ టిడిపి కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కేటి మల్లికార్జున, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, బనవాసి నరేంద్ర రెడ్డి, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ,16వ వార్దు బెస్త హనుమంతు,ఎమ్మిగనూరు మండలం టిడిపి నాయకులు మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, గుడికల్ కోలంట్ల నాగరాజు, కోలంట్ల వెంకటేష్, కె. తిమ్మాపురం కురువ వీరేష్, పట్టణ టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. అబ్దుల్ జబ్బర్, మదిరే పీర్ భాష, గోరా బాషా, మహబూబ్ బాషా, ఆఫ్గాన్ వలిభాష, జోహార్ అబ్బాస్, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, సప్లయర్స్ బంగారప్ప, దర్జీ మోషన్న, అల్వాల ప్రసాద్, యస్.సాల్మన్, జాలవాడి ఏసన్న, పందికోన సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version