Andhrapradesh
కరువు,కరెంటు సమస్యపై రేపు రోడ్డు దిగ్బంధనం……రైతు,వ్యవసాయ కార్మిక సంఘాలు..
జిల్లాలో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో జిల్లాని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్తో దేవనకొండ టర్నింగ్ లో రేపు ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు రోడ్డు దిబ్బందన కార్యక్రమం చేపడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి లు తెలిపారు.
ఈ మేరకు వారు పత్రికా ప్రకటన చేస్తూ కరువు సమస్యపై పాలకులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని వేలకు, వేల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన, సాగునీటి సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు, ఆదుకోవలసిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించిన ఎకరాకు 40 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా కరువు నేపథ్యంలో ఉపాధి పనులు కల్పించాలని 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు వ్యవసాయానికి 9 గంటల కరెంటు అన్న ప్రభుత్వం ఐదు గంటలు కూడా సరిగ్గా కరెంటు ఇవ్వలేకపోతుందని 9 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ తో రేపు జరగబోయే రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని మండల రైతంగాం జయప్రదం చేయాలని వారు కోరారు.