Andhrapradesh

మళ్ళీ నువ్వే కావాలి జగనన్న ..గుమ్మనూరు శ్రీనివాసులు.

Published

on

228 Views

సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందుకే రాష్ట్రానికి సీఎం జగన్ అవసరమని అన్ని వర్గాలప్రజలు కోరుకుంటున్నారని శుక్రవారం దేవనకొండ పట్టణంలోని 2 వ సచివాలయం లో పరిధిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కు జగన్ మళ్ళీ ఎందుకు కావాలి అని కార్యక్రమం వైసీపీ మండలం కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున జడ్పిటిసి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మళ్ళీ సీఎం జగనే ఎందుకు కావాలంటే నిర్వహించిన సమావేశంలో మలమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనురు శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నారన్నారు.

ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలన్న అంశంపైన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు,నాయకులు ఈ నాలుగన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చెప్పేందుకు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నకార్యక్రమమన్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో చెప్పిన హామీలన్నింటిలో ఏమేమి నెరవేర్చాము, ఏ ఇంటికి ఏయే సంక్షేమ పథకాలు అందాయి అని ధైర్యంగా ప్రతి గడప కు వెల్లుచున్నామన్నారు. దేవనకొండ 2వ సచివాలయం లోని వార్డులో ప్రభుత్వం నవరత్నాల పథకం కింద ఆమ్మవడి, విద్యాదీవెన, వసతి దీవెన,వైఎస్సార్ ఆసరా, చేదోడు, వాహనమిత్ర, పింఛన్లు, నాడు నేడు, గడపగడప మన ప్రభుత్వం ద్వారా రూ. 26,34,54,027 లబ్ది చేకూర్చడం జరిగిందని తెలిపారు. అర్హులైనప్రతి ఇంటికీ సంక్షేమ లబ్దిని చేకూర్చినందునే వై నాట్ 175 అంటున్నామన్నారు.

అయితే టిడిపి వాళ్ళు భవిష్యత్ కు గ్యారంటీ అనే కార్యక్రమం చేపడుతున్నారని, 2014 ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో ని ఇచ్చి విజయం సాధించి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారన్నారు. ఆ మ్యానిఫెస్టో లో ఎన్ని హామీలు నెరవేర్చారో ఫలానా వాళ్లకు ఫలానా మేలు చేశామని ప్రతి గడప కు కరపత్రాలను ఇచ్చే దమ్ము, ధైర్యం టిడిపికి ఉందా అని దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ప్రశ్నించారు.

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని టి .డి .పి. వాళ్ళు చెబుతుంటే ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదన్నారు.జగన్ పాలనలోనూ, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్యక్రంలో ఎంపిడిఓ గౌరీదేవి , పంచాయతీ సెక్రటరీ అబ్బుల్ల రహిం వైసీపీ నాయుకులు ,శాంతి,సురేంద్ర రెడ్డి, కుమార్,రాజ రెడ్డి, పల్లేదొడ్డి చంద్ర ఎంపీటీసీ లు , సర్పంచులు కుంకునూరు సచివాలయ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి గిత్త పరమేష్ , వాలంటరీలు సచివాలయ సిబ్బంది తదితరాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version