Andhrapradesh
పోరుచేయ కదులుదాం.. రండి ! కదలిరండి !!
దేవనకొండలో సిపిఐ 30 గంటల దీక్ష గోడపత్రికల ఆవిష్కరణ.
కృష్ణా జలాల పునః పంపిణీ, కరువుపై సిపిఐ 30 గంటల దీక్షను జయప్రదం చేయండి.
నీళ్ళే సంస్కృతి.. నీళ్ళేచరిత్ర… కరువు, వలసలు, ఆత్మహత్యల విముక్తికై.
నిధులు, నికరజలాల సాధనే లక్ష్యంగా.. భావితరాల భవిష్యత్తుకై.
కృష్ణా జలాల పున:పంపిణీపై గెజిట్ నోటిఫికేషన్ రద్దు కొరుతూ కరువు నివారణ సహాయక చర్యలు ఆంధ్రప్రదేశ్ భవిత కోసం 2023 నవంబర్ 20, 21వ తేదీలు విజయవాడలో జరుగు 30 గంటల నిరసన దీక్షలు జయప్రదం చేయాలని దేవనకొండ సిపిఐ కార్యాలయంలో గోడపత్రికలు విడుదల చేస్తున్న సీపీఐ బృందం.శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కృష్ణా జలాల పంపిణీ పై గెజిట్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా, రాష్ట్రంలో కరువు పరిస్థితులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఖండిస్తూ ఈనెల 20 21వ తారీకులలో విజయవాడలో నిర్వహించే 30 గంటల నిరసన దీక్షను జయప్రదం చేయాలని తెలిపారు. ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టే వరకు రాష్ట్రస్థాయిలో ఉద్యమాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందడానికి మోడీ ప్రభుత్వం కృష్ణాజిల్లాల వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని దీని ద్వారా ఏపీకి అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఎండిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని, గ్రామాల్లో 200 రోజులు ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ 30 గంటల నిరసన దీక్షలో రైతులు ప్రజాసంఘాలు సిపిఐ నాయకులు కార్యకర్తలు విరివిరిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సిపిఐ 30 గంటల దీక్ష వాల్ పోస్టర్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ప్రసాద్, రామాంజనేయులు, సుల్తాన్, రవి, భాష, శ్రీనివాసులు, భాస్కర్, రామంజి తదితరులు పాల్గొన్నారు.