Andhrapradesh
కరువు వలసలు నివారించడంలో అధికారుల వైఫల్యం.
ష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి.
దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినప్పటికీ కరువు సహాయక చర్యలు ఇప్పటివరకు చేపట్టకపోవడంపై సీపీఐ ధర్నా.
ఇటీవల ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు కానీ ఇప్పటివరకు కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం వలన వ్యవసాయ కూలీలు రైతులు సుదూర ప్రాంతాలకు వలసలకు వెళ్తున్నారు. వలసల నివారణ చర్యలో భాగంగా తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసారావు లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పట్టణ సహాయ సి.కృష్ణ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..
దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినంత మాత్రాన సరిపోదన్నారు.తక్షణమే పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేయాలన్నారు.ఒక ఎకరాకు 40,000 వేల రూపాయల నుండి లక్ష రూపాయల దాకా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
రాబోయే ఖరీఫ్ సీజన్ కు 90% సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు రైతులకు ఇవ్వాలన్నారు.బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేయాలన్నారు. వలసలను నివారించి, జాతియ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి, 200 రోజులు పనులు కల్పించాలి 600 కనీస వేతనం ఇవ్వాలన్నారు.
ఇన్సూరెన్స్ డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు. తక్షణమే పశువులకు మేత ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు. కరువు మండలంగా ప్రకటించి నందున తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ ధర్నా ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు కోటకొండ హరిచంద్ర, నల్లచెలిమల బజారి, కరివేముల బాలాజీ, పాలకుర్తి అశ్వద్ధామ, సుల్తాన్, శ్రీనివాసులు, కోదండ, మహమ్మద్, రాముడు, రమేష్, దస్తగిరి, వెంకటరాముడు, మిన్నళ్ల, వీరస్వామి, రామాంజనేయులు, భాష, మహదేవ, మహేష్, విద్యార్థి, యువజన సంఘం నాయకులు భాస్కర్, మధు, రామాంజనేయులు, నాగేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.