Andhrapradesh
గద్దెరాల్ల మారెమ్మ ట్రస్ట్ ఏర్పాటు నోటిఫికేషన్ రద్దు చేయండిగ్రామస్థులు, అయకట్టుదారులు, పూజారులు విన్నపం.
దేవనకొండ మండలం గద్దెరాల్ల గ్రామంలో ఉన్న ప్రసిద్ది గాంచిన మారెమ్మ అవ్వకి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ వారు నోటిఫికేషన్ ను ఇచ్చారు అయితే గ్రామంలో ఉన్న ప్రజలకు, పూజారులకు,ఉత్సవ కమిటీకి, ఆయకట్టదారులకు ఏమాత్రం తెలియకుండా దేవదాయ శాఖ వారు ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయటం న్యాయం కాదని తెలిపారు
ఈ ట్రస్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని తహసిల్దార్ వెంకటేశ్ నాయక్ కు సోమవారం గ్రామస్తులు అందరూ వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో పురాతన కాలం నుంచి దేవర ఉత్సవాలు ప్రతి రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరుగుతుందని అయితే 2003 కంటే ముందు గ్రామంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరగడం వలన గ్రామస్తులంతా ఏకమై దేవా లయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి చేర్పించాలని విన్నవించడంతో 2003లో గద్దర్ల మారెమ్మ దేవాలయాన్ని దేవదాయ శాఖ వారు విలీనం చేసుకున్నారన్నారు.
గడచిన పదేళ్లుగా ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా దేవర ఉత్సవాలను గ్రామస్తులు ఆయకట్టదారులు పూజారులు పోలీస్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జాతరలు జరిపించారని అయితే ఇప్పుడిప్పుడు దేవాలయ కమిటీ ఏర్పాటు చేయాలని ఎందుకు వచ్చింది అన్నారు.
ఇప్పటికీ గ్రామం చాలా ప్రశాంతంగా ఉందని కమిటీలు ఏర్పాటు చేస్తే గ్రామంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని కావున మా గ్రామంలో ప్రశాంత వాతావరణ ఉండాలని మా గ్రామానికి గ్రామంలో ప్రజలందరూ అలాగే వచ్చే భక్తులందరూ ప్రశాంతంగా ఉండాలంటే కమిటీ ఏర్పాటు చేయాలని నోటిఫికేషను తక్షణమే రద్దు చేయాలని వారన్నారు లేని పక్షంలో లేబర్ మినిస్టర్ గుమ్మనూరు జయరాం కి అలాగే జిల్లా కలెక్టర్ కి విన్నవించి అవసరమైతే ఆందోళన చేపట్టడానికి కూడా గ్రామస్తులు మహిళలు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూరన్న, సంజప్ప కౌలుట్ల, రామకృష్ణ , మోకసి కృష్ణ పూజారి సూరి నాగేష్ మోకాసి మహాదేవప్ప ఆంజనేయులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు