Andhrapradesh
ఆడుదాం ఆంధ్ర’ గమ్యం.. ఆరోగ్య సమాజం
దేవనకొండ -/ నేటి భారత్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని 2023 డిసెంబర్ 26 వ తేది మంగళవారం జగన్మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా జిల్లా కు సంబంధించి ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండల కేంద్రం వెలమకూరు గ్రౌండ్ నందు వైసిపి మండల నాయకులూ వెలమకూరు రామచంద్ర యాదవ్ ప్రారంభించారు. మొదట జండా వందనం గావించి అనంతరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెలమకూరు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయి లో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రికెట్, కోకో, వాలీబాల్, కబ్బడ్డి & బ్యాట్ మిటన్ ఆటలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ ఆటలో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఆటలు ఫిబ్రవరి 10వ తేదీ వరకు సచివాలయ స్థాయిలో నిర్వహించడం జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపైర్ మద్దిలేటి, సోషియల్ మీడియా సోదరులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సంబంధిత అధికారులు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు, గొల్ల లోకేష్ ,కురువ లసుమప్ప ,అంజి ,శింగాపురం లింగప్ప ,కుకటికొండ బద్రి ,దేవేంద్ర ,విజయ్ ,అశోక్ ,సచివాలయ సిబ్బంది ,వాలంటరి లు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.