Andhrapradesh

అధికారం మీద ఉన్న శ్రద్ధ రైతులకు పంట నష్టపరిహారం పై పెట్టండి….సీపీఎం

Published

on

188 Views

కరువు నేపథ్యంలో రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు పంట నష్టపరిహారం ఇప్పించాలనే చిత్తశుద్ధి ప్రజాప్రతినిధులకు లేకపోగా సీట్ల కోసం అధికారం కోసం పాకులాడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి వీర శేఖర్ విమర్శించారు

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వివక్ష చూపుతోందని, ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించినప్పటికీ పరిహారం చెల్లించలేదని, తక్షణమే పంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు.


సోమవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల నాయకులు యూసుఫ్ భాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతంగం తీవ్రంగా నష్టపోయిందని కరువులు వరుసగా వస్తున్నాయని ఆదుకోవలసిన ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎకరాకు 50 వేల పరిహారం వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా బ్యాంకుల్లో రైతుల తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. గత టిడిపి ప్రభుత్వంలో కూడా2018 సంవత్సరంలో కరువు మండలంగా ప్రకటించినప్పటికీ పరిహారమందించడంలో అప్పటి ప్రభుత్వము పూర్తిగాఫలమైందన్నారు.

ఈ ఏడాది కూడా ఎన్నికల నేపథ్యంలో అదే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలసలు నేపథ్యంలో విద్యార్థిని, విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని వెంటనే మండలంలో సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు అశోక్, మహబూబ్బాషా, సూరి, బజారి ,కెపి రాముడు, ప్రజాసంఘాల నాయకులు బడే సబ్, లోకయ్య,నాగేష్, వెంకటేష్, బలరాముడు,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version