Andhrapradesh
సీయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి బుడగ జంగాల సమస్య తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చినఆలూరు వైసిపి ఇంచార్జ్ బి.విరుపాక్షి .
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గం
వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విరుపాక్షి కి వినతి.
బుడగ జంగాలకు ఇళ్లస్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
బుడగ జంగాలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలి.
బుడగ జంగాల డేరాల దగ్గరికి వెళ్లి వాళ్ల స్థితిగతులు తెలుసుకున్న విరుపాక్షి.
దేవనకొండ మండల కేంద్రమైన దేవనకొండలో 60 సంవత్సరాలుగా డేరాలేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి బుడగజంగాలను ఆదుకోవాలని వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని అదేవిధంగా ఏళ్ల తరబడి వారికి కుల సర్టిఫికేట్ లేదని అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కాలేదని తక్షణమే బుడగ జంగాల సమస్యను పరిష్కరించే విధంగా వారికి కుల సర్టిఫికెట్లు మంజూరు చేసి అదే విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆలూరు నియోజకవర్గ కార్యదర్శి మునిస్వామి ఆధ్వర్యంలో ఆలూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ విరుపాక్షికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా విరూపాక్షి బుడగజంగాలు వేసుకున్న డేరాల దగ్గరికి వెళ్లి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకొని వారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆలూరు నియోజకవర్గం కార్యదర్శి మునిస్వామి మాట్లాడుతూ బుడగ జంగాల యొక్క పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయని ఇప్పటికీ వారికీ వారి కులం ఏదో ప్రభుత్వం గుర్తించలేదని ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా బుడగ జంగాల యొక్క స్థితిగతులు ఏమాత్రం మార్పు రాలేదని వీరిని కేవలం ఎన్నికల్లో ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తూ గెలిచిన అనంతరం ఎవరు కూడా పట్టించుకోవడంలేదని దీనివల్ల వారు ఊరికి దూరంగా జీవనం కొనసాగిస్తూ నివసించడానికి ఇల్లు లేవు డేరాలు వేసుకొని ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో తాత్కాలికంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు.
వీరి పిల్లలు ఇప్పటిదాకా చదువుకోవడానికి కుల సర్టిఫికెట్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వీరి కులంలో చదువుకోవడానికి అవకాశం లేక చదివించలేక వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి తక్షణమే వీరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అంతే కాకుండా కుల సర్టిఫికేట్ కి విచారణ చేసి వీళ్లకు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి కోరడమైనది. అందుకు స్పందించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ విరుపాక్షి జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులకు మరియు బుడగ జంగాలకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి హర్షవర్ధన్ రెడ్డి , అలరిదిన్నె ప్రభాకర్ రెడ్డి మోహన్ రెడ్డి, ప్రేమ్నాథ్ రెడ్డి , నారాయణరెడ్డి నిర్జల్ రెడ్డి సుధాకర్ రెడ్డి, పాలకుర్తి ప్రతాప్, ఎంకే కొట్టాల గఫూర్ పోట్లపాడు కేశవ ఆనంద్ వెంకటాపురం శంకరయ్య, వెలమకూరు జయన్న, తదితర వైఎస్ఆర్సిపి నాయకులు బుడగ జంగాల కులస్తులు అందరూ పాల్గొనడం జరిగింది