Andhrapradesh
సమ సమాజ స్థాపనే ధ్యేయంగా అమరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం CPI.
ఘనంగా CPI 99వ వార్షికోత్సవాలు.
అమరవీరుల స్ఫూర్తితో సమ సమాజ స్థాపనే ధ్యేయంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు లు పిలుపు నిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99 వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా మంగళవారం దేవనకొండ సీపీఐ శాఖ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయం ముందు సిపిఐ పట్టణం సహాయ కార్యదర్శి వడ్డె రాజశేఖర్ అధ్యక్షతన అరుణ పతాకాన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు కె.మద్దిలేటిశెట్టి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భారత కమ్యూనిస్టు పార్టీ CPI 1925 సంవత్సరం డిసెంబర్ 26 వ తేదీ నాడు భారతదేశంలో కాన్పూర్ మహానగరంలో ఆవిర్భవించిందని, ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశానికి స్వాతంత్రం కావాలని జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో ఉండి పాల్గొన్నదని పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం ఆనాటి జాతీయ నాయకులు ఏళ్ల తరబడి కాన్పూర్,మీరట్, కుట్ర కేసులో ఇరుక్కుని జైల్లో నిర్బంధించబడ్డారని తెలిపారు.స్వాతంత్రం కోసం అనేకమంది ప్రాణాలు సైతం త్యాగం చేశారని, దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని మొదట తీర్మానం చేసిన పార్టీ సిపిఐ అని ఉద్ఘాటించారు.98 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో అనేక పోరాటాలు అనేక త్యాగాలు చేసి అనేక విజయాలను సాధించిన చరిత్ర సిపిఐ కు ఉన్నదని తెలిపారు.
నాటి నుండి నేటి వరకు పేద ప్రజలు, కార్మికులు,కర్షకులు, శ్రమజీవుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు, అశేషత్యాగాలు చేసిన ఘన చరిత్ర సిపిఐ కి ఉన్నదని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్రలేని బ్రిటిష్ వారికి ఊడిగం చేసిన ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు దేశాన్ని పరిపాలిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రజలను విడదీస్తూ ఘర్షణలు పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయని ఆరోపించారు.
దేశ రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వారికి గుణపాఠం చెప్పడానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపడానికి సమాయత్తం కావాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ప్రసాద్, రైతు సంఘం మండల కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, నల్లచెల్లిమెల శాఖ కార్యదర్శి బజారి, పాలకుర్తి శాఖ కార్యదర్శి అశ్వద్ధామ, కుంకనూరు శాఖ కార్యదర్శి గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కృష్ణ, అఖిల భారత యువజన సమాఖ్య మండల అధ్యక్ష కార్యదర్శులు రవి రామంజి అఖిల భారత విద్యార్థి సమాఖ్య మండల అధ్యక్ష కార్యదర్శులు మధు భాస్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బడే సాహెబ్ మండల నాయకులు సుల్తాన్ భాషా వీరాంజి విద్యార్థి యువజన సంఘాల నాయకులు రంగన్న ఫయాజ్ రామంజి నరేష్ శ్రీరంగడు ఆటో, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.